T20 WCలో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ప్లేయర్లకు PCB ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లేయర్లంతా హెడ్ కోచ్ మైక్ హెసన్పై బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కనీసం తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆరోపించినట్లు సమాచారం. కాగా కోచ్ నిర్ణయాలు తీసుకుంటూ కెప్టెన్ ఆఘాను డమ్మీ చేశారని ఇటీవల పాక్ జర్నలిస్టులు కూడా ఫైరయ్యారు.