ATP: గుంతకల్లు ఆశా వర్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఎన్ఎం విజయభారతి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CITU నాయకులు ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ హాస్పిటల్ DDO గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU నాయకులు సాకే నాగరాజు, తిమ్మప్ప మాట్లాడుతూ.. ఆశా వర్కర్లపై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.