E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కొవ్వూరు డీఎస్పీ దేవ కుమార్ ఆధ్వర్యంలో వేములూరు దీప్తి హైస్కూల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ నిర్వహించారు. కరాటే ఇన్స్పెక్టర్ ఆకుల రాధ విద్యార్థినులకు మెళకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ పీ.విశ్వం, తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వయం రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు.