KMM: చింతకాని మండలంలో జరిగిన ఇసుక ట్రాక్టర్ ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన నాగయ్య మృతి చెందారు.మృతుడు తొలుత 19 ఏళ్ల యువకుడిగా భావించినా పదో తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా 16 ఏళ్ల మైనర్ అని తేలింది.నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనం ఇచ్చినందుకు యజమానిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వీరేందర్ బుధవారం తెలిపారు.