MBNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.