PDPL: అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో సుల్తానాబాద్ ఎస్సీ హాస్టల్ విద్యార్థిని సందవేణి కావ్య ప్రథమ స్థానంలో నిలిచి మంత్రులు సీతక్క, లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష కావ్యను శనివారం కలెక్టరేట్లో ప్రత్యేకంగా అభినందించారు. ఆమె ప్రతిభను కొనియాడారు.