నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్. అయితే ఈ డీల్‌లో ‘పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్’ మోడల్‌ను అనుసరించినట్లు సమాచారం. దీని ప్రకారం.. థియేటర్లలో ఈ సినిమా సాధించే నెట్ కలెక్షన్లలో 50 శాతాన్ని నెట్‌ఫ్లిక్స్ చెల్లించనుంది.