ADB: ఈ నెల 20 నుంచి 25 వరకు అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు. ఈ మేరకు ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 21 నుంచి 23 వరకు ఢిల్లీలో నిర్వహించే పార్లమెంట్ ముట్టడిలో పాల్గొనేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.