మంచిర్యాల జిల్లాలో 2025-26 సంవత్సరానికి పాడి గేదెల పెంపకం పథకం కోసం అర్హత గల SC యువత దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పొడిగించినట్లు కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్లో నమోదు చేసిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన ప్రతులను జతపరిచి సంబంధిత కార్యాలయాలలో సమర్పించాలని సూచించారు.