ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ఇవాళ్టి నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్బంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయం, 23న ఉదయం 6:15 గంటలకు బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారుల వెల్లడించారు.