నిర్మల్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శనివారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కార్డులు మంజూరు చేయకూడదని సూచించారు.