ASF: కాగజ్ నగర్ మండలం కడంబా MPUPS పాఠశాలను MEO వాసాల ప్రభాకర్, HM చంద్రశేఖర్ బుధవారం తనిఖీ చేశారు. FLN , లిప్ (LIP) పరీక్షల్లో భాగంగా 3, 6 తరగతుల విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలపై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని వారు సిబ్బందిని ఆదేశించారు.