TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా అధికారులను కించపరిచినవారిపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.