NDL: మహానంది పుణ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు కావాలని ఈవో శ్రీనివాసరెడ్డి కోరారు. క్షేత్రంలోని కళాక్షేత్రం ముందు భాగంలో కర్నూలుకు చెందిన పోగుల మహేశ్వర్ రెడ్డి చంద్రశేఖర్ అమ్మ దంపతులు ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని మహాశివరాత్రి నాటికి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.