CTR: కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర రాజు ఘన నివాళులు అర్పించారు. కవిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో మూఢనమ్మకాలపై పోరాటం చేసి, సామాజిక సమానత్వం, హేతువాదం ప్రచారం చేసిన మహనీయుడు అని కొనియాడారు.