AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెడ్డినగర్‌లో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో MBBS విద్యార్థి ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.