GNTR: లక్ష్మీపురం త్యాగరాజ కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంగీత సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధన సంగీత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షలు డాక్టర్ పి. విజయ తెలిపారు. మొదటి రోజు శనివారం సుప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు శశాంక్ కచేరి, ఆదివారం ఉదయం బెజవాడ లక్ష్మీకాంత్ నాదస్వర కచేరి, శోభాయాత్ర, పంచరత్న కీర్తనలు ఉంటాయన్నారు.