MDK: రేగోడ్ మండలంలో వృద్ధ దంపతుల మరణం హృదయాలను కలిచివేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు సంగారెడ్డి భార్య విట్టమ్మ అనారోగ్యంతో ఈ నెల12 మృతి చెందారు. భార్య మరణంతో తీవ్రంగా కుంగిపోయిన సంగారెడ్డి (70) ఇవాళ ఉదయం కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి నిరసన కార్యక్రమంలో ఆయన చురుకుగా పాల్గొని ఉద్యమానికి అంకితమయ్యారు.