NRPT: సంక్రాంతి సందర్భంగా నారాయణపేట జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. నాలుగు రోజుల్లో మొత్తం రూ.64.9 కోట్ల అమ్మకాలు నమోదైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈనెల 12న రూ.9.56 కోట్లు, 13న రూ.8.66 కోట్లు, 14న రూ.9.87 కోట్లు, 16న రూ.11.81 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 227 మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు.