కృష్ణా: మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి రామాలయం ఘనంగా ముస్తాబైంది. ఆలయాన్ని పూలు, దీపాలతో అందంగా అలంకరించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. సంక్రాంతి వేళ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడాయి.