NLR: సంక్రాంతి పండుగకు నెల్లూరు జిల్లా కళకళలాడుతోంది. విదేశాల్లో, దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొంతగూటికి చేరుతున్నారు. నెల్లూరు నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 27 ఏళ్లుగా డల్లాస్(USA) నుంచి క్రమం తప్పకుండా పండుగకు వస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.