JGL: జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏవో) సంజీవ్ (52) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన సంజీవ్ ఇదివరకు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేశారని సమాచారం. ఆయన ఆకస్మిక మృతితో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు సంతాపం వెలిబుచ్చారు. కాగా, సంజీవ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.