పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు సూర్యకళ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా ఆమె అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని MPPS క్యాంప్ పాఠశాలలో ఎస్టీటీగా చేస్తున్నారు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారాని కుటుంబ సభ్యులు తెలిపారు.