శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం మాంసాహారానికి భారీ డిమాండ్ నెలకొంది. చికెన్, మటన్, చేపల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. డిమాండ్ పెరగడంతో మటన్ కేజీ రూ.1000కు, చికెన్ కేజీ రూ.280కు చేరింది. చేపలు కేజీ రూ.200 నుంచి విక్రయమవుతున్నాయి. పండుగ నేపథ్యంలో గ్రామీణ మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి.