SKLM: ప్రతి ఇంటా పాడి పంటలు, సిరిసంపదలు విరాజిల్లాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తమ కష్టాల్లో భాగమైన పశువులను పూజించుకునే గొప్ప పండగ కనుమ అని, రైతుల కష్టాలు తీరి, వారు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.