W.G: నరసాపురం(M) సీతారామపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ సంక్రాంతి సందడిని అంబరానికి చేర్చింది. ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు ప్రజలు ప్రవాహంలా తరలివస్తున్నారు. చిన్నలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా గగన విహారం చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. గగన విహారానికి ఈరోజే చివరి రోజు కావటంతో జనం భారీగా తరలివస్తున్నారు.