ELR: జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలో పేకాట కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై కేసును నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ నేపథ్యంలో 3 రోజులు జరిగిన పేకాట, కోడిపందేలు నిర్వహించిన, ఆడిన వారిపై 27 కేసులు నమోదు చేసి 82 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు. పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.