SDPT: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 13 మందికి రూ.1,32,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. వీరిని వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, మద్యం సేవించినట్లు నివేదిక రావడంతో స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.