GNTR: బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం కళావేదికపై శుక్రవారం దేవరపల్లి ప్రభుదాస్ రచించిన ‘విలాసిని’ పద్య కావ్యం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడతూ.. తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాలకు ప్రత్యేక స్థానం ఉందని, విలాసిని కావ్యం సాహిత్యాభిమానులను ఆకట్టుకునే విధంగా ఉందని ప్రశంసించారు.