కరీంనగర్లోని 9వ డివిజన్ అలకాపురి కాలనీలో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. శ్రద్ధ ఇన్ హోటల్ నుంచి హనుమాన్ దేవాలయానికి వెళ్లే రోడ్డు మధ్యలో తవ్విన గుంతను 2 నెలలు గడుస్తున్నా పూడ్చకుండా వదిలేశారు. దీనివల్ల రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు పట్టించుకోవడ లేదని, సమస్య పరిష్కరించాలన్నారు.