కృష్ణా: మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో నిర్వహించిన మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మే నెల ఒకటవ తేదీ నుంచి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా పూర్తి చేయాలని గణన ఛార్జ్ అధికారులను ఆదేశించారు.