GNTR: నల్గొండ జిల్లా చింతపల్లి పోలీసులు విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముప్పాళ్ల లీలాకృష్ణ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన ఇతడు సుమారు రూ. 85 లక్షలు వసూలు చేసినట్లు అడిషనల్ DSP రమేశ్ వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు, అతని నుంచి కీలకమైన ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.