SRD: సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17 నుంచి 19 వరకు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఈవెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. 15 నుంచి 21 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.