MHBD: గార్ల మండలంలోని అంకన్న గూడెం గ్రామానికి చెందిన పెండకట్ల అశోక్ (33) అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం తన సొంత వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో మోటార్ మరమ్మతుల కోసం బావిలోకి నిన్న దిగడంతో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.