GNTR: గుంటూరులో నేడు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో సరస్ మేళా సందర్శన కోసం భారీ ర్యాలీ జరగనుంది. ఉదయం 10 గంటలకు పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నల్లపాడు రోడ్డులోని మేళా ప్రాంగణం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కూటమి మహిళా నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.