GNTR: తాడికొండ మండల వ్యాప్తంగా సోమవారం నుండి ఈ నెల 31వ తేదీ వరకు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు వైద్యాధికారి రాయప్ప రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిబిరాలలో గేదెలకు, దూడలకు నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.