KNR: వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.