బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ‘తు మేరీ మెయిన్ తేరా మేన్ తేరా తు మేరీ’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు నష్టాలు చవి చూశారు. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి కార్తీక్ రూ.15 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం అతను దాదాపు రూ.50కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.