TG: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ వద్ద వాటర్ ట్యాంకర్ను కారు ఢీకొట్టగా, వైరా వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పొగమంచు వల్లే ప్రమాదాలు జరిగాయని వాహనదారులు, స్థానికులు అంటున్నారు.