SKLM: రైతు ఇంట పాడిపంటల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కోటబొమ్మళి మండలంలో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాతలు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. పశుపక్ష్యాదులకు పూజించడమే కనుమ పండుగ ప్రత్యేకతన్నారు.