AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోనసీమలో జగ్గన్నతోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దాదాపు 400 ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఉత్సవాలు చూసేందుకు లక్షల మంది హాజరవుతారు. ఈ ఏడాది జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.