KNR: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, డప్పు వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.