AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందాలు జోరుగా జరుగుతున్నాయి. ఏలూరు, భీమవరం, కాళ్ల ఉండి, ఆకివీడు, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, ఉంగుటూరులో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. కోడిపందాలతో పాటు పేకాట, గుండాటలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో రూ.వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్ వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.