KMM: పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. “ఫోన్‌పై పొంగల్ గిఫ్ట్” అంటూ రూ. 5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకులపై ఖమ్మం పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సునీల్ దత్ సూచించారు.