ఏలూరు: జిల్లా జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జి వద్ద ఇవాళ ఉదయం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పట్టణానికి చెందిన గూడూరు సాయి (25)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.