PDPL: ఓదెల మండలం జీలకుంట గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో గురువారం అర్థ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారికి అలంకరించిన రెండు ముక్కుపుడకలు, పుస్తెలతాడుతో సహా సుమారు రూ.1 లక్ష 30 వేల విలువైన బంగారు నగలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.