MDCL: ఉప్పల్ పరిధి శిల్పారామంలో ఇవాళ పండగ వాతావరణం నెలకొననుంది. ఈ సందర్భంగా గోదాదేవి పూజలు, కళ్యాణం, భక్తి నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సంప్రదాయం, భక్తి, కళల సమ్మేళనంగా ఈ వేడుకలు సాగనున్నాయి. భక్తులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను తిలకించి ఆనందించాలని నిర్వాహకులు కోరారు.