కేంద్ర సాయుధ బలగాల్లో 53,690 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి SSC తుది ఫలితాలను విడుదల చేసింది. మెరిట్ జాబితాలో పురుషులు, మహిళల వివరాలను విడివిడిగా అధికారిక వెబ్సైట్ ssc.gov.inలో అందుబాటులో ఉంచారు. అన్ని దశల పరీక్షలు ముగిశాక అభ్యర్థులను తుది ఎంపిక చేశారు. విత్‌హెల్డ్‌లో ఉన్న వారి వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.