ASF: ఈనెల 20న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఛలో ఇందిరాపార్క్ వాల్ పోస్టర్ను కాగజ్ నగర్ లో MLA హరీష్ బాబు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరుదీక్షకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రమించిన కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.