HYD: సంక్రాంతి సందర్భంగా ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సరదా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని, ముఖ్యంగా నిషేధిత చైనా మాంజాను వాడొద్దని హెచ్చరించారు. ఈ సింథటిక్ దారాలు పక్షులకే కాక, వాహనదారుల మెడకు చుట్టుకుని ప్రాణాంతకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. పిల్లలను డాబాలపై ఒంటరిగా వదలొద్దని సూచించారు.